Friday, May 9, 2008

నాలోని "సుమన్" నిద్ర లేచాడు

ఇప్పటికి నాలోని "సుమన్" నిద్ర లేచాడు.లేచిన వాడు లేచినట్టు ఉండక ఒక్కటే పోరు, నాలుగు నెలలు అయ్యింది బ్లాగు తయారు చేసుకున్నావు, ఎప్పుడు మొదలు పెడతావు అని.బాబూ ఎదో ఆవేశంలో తయారు చేసేసాను అని ఎంత చెప్పినా వినటం లేదు.ఎలాగైనా ఎదైనా రాసే తీరాలి అని ఒక్కటే గోల, కోవై సరళ కామెడీ లాగా(గోలే తప్ప విషయం లేనట్టు).ఏమి చేస్తాం ఏమద్య అందరు రాసినవీ క్రమం తప్పకుండా చదువుతున్నాడు కదా ఆమాత్రం ఆవేశం సహజం, కాని దాన్ని నామీద రుద్దితే ఎలా,సుమన్ దెబ్బకి నేను తట్టుకోగలనా?(ఎవ్వరికీ సాధ్యం కాదు అనుకోండి).వీడి పోరు పడటం కంటే ఎదో ఒకటి రాసేయటమే మేలు అనుకొని రాయటం మొదలుపెట్టాను.నా పరిస్థితి ఎలా ఉందంటే హీరో డేటులు దొరికయి కదా అని సినిమా మొదలు పెట్టేసిన డైరెక్టర్ లా వుంది,కథ లేదు, కథనం తెలియదు.ఏదోలా రాయటం పూర్తి చేసేసి మొదటి నుంచి మళ్ళీ ఒక్కసారి చదువుకుందును కదా, నా పరిస్థితి మరీ దారుణంగాతయారయ్యింది, ఫ్లాప్ సినిమా డైరెక్టర్ లా, ఎమి రాద్దమనుకున్ననో? ఏమి రాసానో? తెలియకుండా.

ఏమి చేస్తాం సినిమా మొత్తం తీసేసాక రిలీజ్ చెయ్యటం మానేస్తామా? రిలీజ్ చేసేద్దాం, ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేద్దాం.రేపు జరిగే "సక్సెస్ మీట్" లొ కలుద్దాం, నమస్కారం.

6 comments:

సూర్యుడు said...

All the best :-)

Anonymous said...

మంచిది మళ్ళె పడుకోబెట్టకండి.

ఎప్పుడూ కాంప్లాన్‌ తాగుతూ, నిద్రొచ్చినప్పుడు బ్రూ తాగుతూ బ్లాగండి.

-- విహారి

కొత్త పాళీ said...

unleash the demon!

All the best.

దైవానిక said...

అబ్బ మొత్తానికి మొదలెట్టారన్నమాట. ఇక టపాలు కట్టలు తెంచుకొని పరిగెట్టాలి :)

రాధిక said...

ఇలాగే కానివ్వండి.బాగుంది.

cbrao said...

సుమన్ నే కాదు, ప్రభాకరాన్ని కూడా నిద్ర లేపండి.యాహూ అని గట్టిగా ఒక సారి అరచి, మీ తరువాత బ్లాగు కై కీ బోర్డ్ ముంగిట కూర్చోండి. టపా అదే వస్తుంది. మీ టపాకు అభినందనలు కూడా.