Friday, April 17, 2009

చూడొద్దంటున్నా చూస్తూనే వుంటా (పోకిరి) పాటకి పేరడీ



పల్లవి : కొట్టొద్దంటున్నా కొడుతూనే ఉంటా తొడ కొట్టేటందుకే నేను పుట్టాననుకుంటా

తిప్పందంటున్నా తిప్పుతూనే ఉంటా మీసాన్ని తిప్పేటందుకే మీ ముందుకొస్తున్నా

కొట్టైనా కొట్టైనా తొడ అంత కందిపొయేలా

తిప్పైనా తిప్పైనా తిప్పైనా ...

(ఫాన్స్) వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా మా బాలయ్య

వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా పరువె తీయొద్దయ్యా





చరణం : కష్టపడి నేను సినిమాలు చేస్తే ఫ్ల్లాపౌతున్నాయి

ధియేటర్స్ అన్నీ ఖాళీగ నన్ను వెక్కిరిస్తున్నాయి

ఎన్నేళ్ళైనా హిట్టులు లేక పిచ్చెక్కిపొయింది

వేరేదేదీ చేతేకాక వెర్రెక్కిపోయింది

సినిమాలే చేద్దామంటే నిర్మాతరాకుండే

ప్రజలేమో నన్నింకసలు పట్టించుకోకుండే

ఖాళీగా కూర్చున్న నన్ను బావే పిలిచాడు

తొడకొట్టి ప్రచారమేదో చెయ్యాలన్నాడు

వచ్చేస్తా వచ్చేస్తా మీ ఊరు నేను వచ్చేస్తా

కొట్టేస్తా కొట్టేస్తా కొట్టేస్తా ..



(ఫాన్స్) వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా మా బాలయ్య
వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా పరువె తీయొద్దయ్యా






దయ చేసి గమనించగలరు, ఈ ప్రయత్నం ఎవరినీ కించపరచటానికి గానీ ఎవరినీ బాధపెట్టతానికి కానీ చేసినది కాదు, సరదాగా నవ్వుకోవటానికి మాత్రమే. ఎవరినైనా నొప్పించివుంటే క్షమించగలరు.

5 comments:

రవి said...

:-) :-)

మంచి స్నేహితుడు said...

చాల బాగుందండి

ఆత్రేయ కొండూరు said...

డోలె డోలె.. దిల్ జర జరా ...
బహు బాగ ఉంది ఇది యోగి వరా ..

Padmarpita said...

ఇక్కడ నవ్వలేక పడిచస్తున్నా....

శ్రీ said...

బాగుందండీ పేరడీ.