Thursday, April 23, 2009

బెల్ట్ భాగవతం

ఓ రోజు పొద్దున్నే ఎవడో తలుపు కొడుతున్నాడు, వెళ్ళి తీస్తే ఒకాయన ఒక పాకెట్ పట్టుకొని నిల్చొని వున్నాడు. ఏంటి అని అడిగితే నరేంద్ర కి పార్సల్ వచ్చ్చింది చెప్పాడు. నరేంద్రా నీకేదో పార్సల్ అంటా అని పిలిస్తే వచ్చి తీసుకున్నాడు. పార్సల్ చూడటానికి రంగురంగుల్లోచూడ చెత్తగా వుంది. ఏమి పార్సల్ రా అది? ఏమి లేదురా మొన్న టివి లో పొట్ట తగ్గడానికి బెల్ట్ చుపించాడురా,ఒకటి ఆర్డర్ చేసారా ఇప్పుడు అది వచ్చింది అని చెప్పాడు. నీ కేమైనా మతిపోయిందా అవేమైనా పని చేస్తాయనుకున్నావా ఊరికినే డబ్బులు వేస్ట్ చెయ్యటానికి కాకపోతే అని అంటుంటే మధ్యలోనే అందుకుని నిజంరా ఇది చాలా బాగా పని చేస్తుంది, మూడు రోజుల్లోనే ఎటువంటి పొట్టనైనా తగ్గించేస్తుందిరా, నాకెలాగు మూడు రోజుల్లో తగ్గిపోతుంది తర్వాత నువ్వే వాడుకో అన్నాడు. నువ్వెక్కడ దొరికావురా టీవీ లో చూసేవాన్ని నిజం అనుకుంటావ్, ఇంకా సంతోషం ఈ మధ్య న్యూస్ చానల్స్ చూడటం లేదు ఒకవేళ చుస్తే మన రాష్ట్రం లో ౬౦౦ కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వున్నాయి అనుకుంటావ్, నాకేమి వద్దు కాని నువ్వే పండగ చేసుకో అని చెప్పి స్నానానికి అని బాత్ రూమ్ లో దూరా(అప్పుడప్పుడైనా స్నానం చెయ్యాలని ఈ మధ్య నిర్ణయించుకున్నా)
ఆ రోజు మొదలు నరేంద్ర గదికి ఆ బెల్టే లోకం అయ్యిపోయింది, ఏమి చేసినా బెల్ట్ వుండాల్సిందే, కుర్చున్నా,పడుకున్నా, తిన్నాతిరిగినా చివరికి స్నానం చేసినప్పుడు కూడా వుండాల్సిందే(చీ చీ నేను స్నానం చేసినప్పుడు చూడలేదు).ఎంతగా వాడటం మొదలెట్టదంటే చివరికి మాములు బెల్ట్ మానేసి దాని స్థానం లో ఈ బెల్ట్ నే వాడటం మొదలెట్టాడు. అది పెట్టుకొనే ఆఫీసుకి కూడా పోతున్నాడు.వాళ్ల తమిళ మేనేజర్ కి ఆ బెల్ట్ చాలా నచ్చిందట కుడా. వాడటం మొదలు పెట్టిన రోజు నుంచి రోజు అడగటమే ఏమైనా తగ్గుతుందా అని, మొదటిలో బాధపడతాడు కదా అని ఏదో తగ్గుతుంది తగ్గబోతోంది అని చెప్పేవాడిని, రాను రాను నా ఓపిక తగ్గిపోయింది.

ఒక ఆరు నెలల కఠోర బెల్ట్ దీక్ష తరువాత ఒక రోజు కొంచెం జ్ఞానోదయం అయ్యింది, ఈ బెల్ట్ మంచిది కాదు, పని చెయ్యదు అని. పూర్తీ గ అయ్యుంటే అన్నియాడ్ లు నిజం కాదు అని నమ్మేవాడు. ఇంక ఈ బెల్ట్ తో లాభం లేదనుకుని ఇంక ఏదైనా ట్రై చెయ్యాలని డిసైడ్ ఐపోయాడు, తర్వాత ఏమి చెయ్య బోతున్నడో ఏమో నాకింకా తెలియదు, నాకు తెలిసిన వెంటనే మొదట మీకే చెప్తాను.

8 comments:

asha said...

"నాకెలాగు మూడు రోజుల్లో తగ్గిపోతుంది తర్వాత నువ్వే వాడుకో అన్నాడు."
ఎంత అమాయకత్వం!!

రాధిక said...

హా హా..ఆయనకి పొట్ట తగ్గక పోయినా మీకు ఓపిక తగ్గిందన్న మాట.పోన్లే ఎవరికో ఒకరికి ఏదో ఒకటి తగ్గిందిగా.సంతోషిద్దాం :)

యోగేంద్ర said...

@భవాని : అందుకే కదండి టీవీ ప్రకటన చూసి బెల్ట్ ని కొనేశాడు

@రాధిక : అది పని చేయదని తెలుసుకున్నాడు కదండి, ఇంక మళ్ళీ నా ఓపిక నాకు వచ్చేసింది

KK Pannala said...

so deeni batti neeku em ardhamaindi yogi?

Anonymous said...

Yogi..belt panicheyyakpothe vaadu belt company ki oka critical SRS raise cheyyaleda?

నేస్తం said...

హ హ బాగుంది

cbrao said...

Dear Friend,

బెంగళూరు బ్లాగర్ల సమావేశం జనవరి 2010

The canvassing by e-Telugu from promotion of Telugu in computers, at the recently held Hyderabad book festival is highly successful; details of which can be read at
http://deeptidhaara.blogspot.com/
http://chaduvari.blogspot.com/2009/12/e.html
http://manishi-manasulomaata.blogspot.com/2009/12/blog-post_28.html

As you are aware e-Telugu aims at promotion of Telugu blogs , canvassing of Telugu Wikipedia and localization of websites into Telugu.It encourages writers of a particular place to become friends and helps in better interaction.

I am in Bangalore now. I shall be glad to meet all of you bloggers and Wikipedians.
Some friends of Bangalore suggested that we meet at 3 P.M. ON SUNDAY 3rd Jan 2010 at Entrance gate -Ticket selling point of Lal Bagh.

Come -let us meet. Make new friends. Know your Bangalore Telugu writers. I shall be delighted to meet all of you.

Cordially,

cbrao
Member
e-Telugu.org

cbrao Mobile: 094934 04866

P.S. If you are late to meeting contact us through the above mobile phones.

cbrao said...

మీ e-mail చిరునామాతో నాకు ఒక జాబు రాయగలరు. బెంగళూరు బ్లాగర్ల సమావేశానికి మీకు ఆహ్వానం పంపటానికై ఈ చిరునామా కావల్సి ఉంది. మీకు అభ్యంతరం లేని యెడల మీ టెలిఫోన్ సంఖ్య కూడా ఇవ్వగలరు.
cbraoin at gmail.com
http://deeptidhaara.blogspot.com